2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకముందు నుంచి కూడా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టును ఛాంపియన్ టీమ్ గా నిలిపి ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారధ్య బాధ్యతలు నుంచి తప్పించింది. ఇక యువ ఆటగాడు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. అయితే ముంబై ఇండియన్స్  నిర్ణయంతో అభిమానులు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


 ఏకంగా ఆ జట్టు ఆడిన మ్యాచ్లన్నింటినీ కూడా అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా తనను అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించిన జట్టు యాజమాన్యంపై రోహిత్ అసంతృప్తితో ఉన్నాడని వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ మెగా వేలంలో అతను జట్టు మారబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయ్. ఈ క్రమంలోనే అతను ఏ టీమ్ లోకి వస్తే బాగుంటుంది అనే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు.


 ఇదే విషయం పై ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకల్ వాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపిఎల్ సీజన్లో రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించవచ్చు అంటూ అంచనా వేశాడు. ఈ ఒక్క ఏడాదే రుతురాజ్ కెప్టెన్ గా ఉంటాడని వచ్చే ఏడాది రోహిత్ ఆ స్థానాన్ని భర్తి చేస్తాడని అనుకుంటున్నాను అంటూ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడటం కుదరకపోతే రోహిత్ హైదరాబాద్కు ఆడిన బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరోవైపు అతను వేలంలోకి వస్తే దక్కించుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: