(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా ఈ రోజు రాత్రి ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సారి ఈ రెండు జట్లు కూడా అద్భుతమైన ఫేవరెట్ గా (ఐ పి ఎల్) బరిలోకి దిగాయి. కాకపోతే ముంబై ఇండియన్స్ మాత్రం ఆశించిన స్థాయి ఆట తీరును ప్రదర్శించలేక పోతుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మంచి ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముంబై ఇండియన్స్ జట్టు ఆఖరుగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో తలపడింది.

ఇందులో ఈ జట్టు అద్భుతమైన ఆట తీరుతో విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ముంబై , చెన్నై ఈ టీం లలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వపు మ్యాచ్ ల వివరాలను తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 36 మ్యాచులు జరిగాయి. అందులో ముంబై జట్టు 20 మ్యాచ్ లలో గెలుపొందగా ... చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 16 మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. ఈ విషయంలో చెన్నై పై ముంబై పై పైచేయిని సాధించింది.

ఇకపోతే ఈ రోజు మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగబోతుంది. ఈ స్టేడియంలో ఈ వీరిద్దరి మధ్య 11 మ్యాచ్ లు జరిగాయి. అందులో ముంబై జట్టు 7 మ్యాచ్ లలో గెలుపొందగా ... చెన్నై నాలుగింటిలో గెలుపొందింది. ఈ లెక్క ప్రకారం కూడా ముంబై జట్టు చెన్నై పై చేయి సాధించింది. పోయిన సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఇందులో మాత్రం చెన్నై పై చేయి సాధించింది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే కొన్నింటిలో ముంబై పై చేయి సాధిస్తే మరికొన్నింటిలో చెన్నై పై చేయి సాధించింది. మరి ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: