ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్) లో భాగంగా ఏ జట్టు అయిన ఇన్నింగ్స్ ను త్వరగా పూర్తి చేయనట్లు అయితే ఆ సమయంలో బౌలింగ్ వేస్తున్న టీం కెప్టెన్ పై ఆ వేటు పడుతూ ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు సార్లు పూర్తి చేయాల్సిన సమయంలో బౌలింగ్ ను వేయడం పూర్తి చేయకపోవడంతో ఆ జట్టు కెప్టెన్ అయినటువంటి పంత్ కి సార్లు భారీ మొత్తంలో ఫైన్ పడింది. ఇక ఈయనకు మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయినటువంటి సంజు సాంసంగ్ కూడా ఈ విషయంలో భారీ మొత్తంలో జరిమానాను (ఐ పీ ఎల్) యాజమాన్యం విధించింది. 

ఇకపోతే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో భాగంగా పంత్ ఒక పెద్ద డేంజర్ నుండి తప్పించుకున్నాడు. అసలు విషయం లోకి వెళితే... ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో ఆడిన మ్యాచ్ లలో రెండింటిలో కూడా స్లో రేట్ బౌలింగ్ కారణంగా ఈ జట్టు కెప్టెన్ అయినటువంటి పంత్ కి జరిమానాను ఐపీఎల్ బోర్డు విధించింది. ఒక వేళ ఇలానే మూడో సారి కూడా జరిగితే ఆయనకు పంత్ కి ఒక మ్యాచ్ నిషేధాన్ని "ఐ పి ఎల్" బోర్డు విధిస్తుంది.

ఇక నిన్నటి మ్యాచ్ లో 16 వ ఓవర్ వరకు వీరు చాలా ఎక్కువ సమయంలో తక్కువ ఒవర్లను కంప్లీట్ చేశారు. దీనితో పంతుకి మరోసారి ఈ భారం పడుతుంది అని ఆయన ఒక మ్యాచ్ కి దూరం అయ్యే ఛాన్స్ ఉంది అని చాలా మంది భావించారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ మిగిలిన నాలుగు ఓవర్ లను మాత్రం చాలా స్పీడ్ గా పూర్తి చేశారు. దానితో ఈ డేంజర్ నుండి పంత్ తప్పించుకున్నాడు. మరి రాబోయే మ్యాచ్ లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎంత త్వరగా బౌలింగ్ ను పూర్తి చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: