(ఐ పీ ఎల్) 2024 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ చాలా పేలావమైన ప్రదర్శనను కనబరుస్తుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లను అడగా ... అందులో కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొంది నాలుగు ఇంటిలో ఓడిపోయింది. దానితో ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో కింది నుండి రెండవ వరుసలో ఉంది. ఇలా ప్రస్తుతం చాలా కింది ప్లేస్ లో కొనసాగుతున్న ఈ జట్టుకు ఇప్పటికే ఓ భారీ దెబ్బ తగిలింది.

మరో దెబ్బ కూడా తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ జట్టు లో అద్భుతమైన ప్లేయర్ మిచల్ మార్ష్. ఈయనకు కొన్ని రోజుల క్రితమే చిలమండ గాయం అయ్యింది  దానితో ఈయన తాజాగా స్వదేశానికి తిరిగి వెళ్లారు. ఇక ఈ సీజన్ పూర్తి అయ్యే వరకు కూడా ఈయన తిరిగి వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. దానితో ఒక మంచి ప్లేయర్ ఈ జట్టుకి దూరం అయ్యాడు. ఇదే ఢిల్లీ టీం కి పెద్ద దెబ్బ అనుకుంటే మరొక స్టార్ ప్లేయర్ కూడా ఈ జట్టుకు దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

ఈ జట్టులో అద్భుతమైన ఓపెనర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ కు కొన్ని రోజుల క్రితమే వేలి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆయన ఈ గాయంతో బాధపడుతున్నాడు. దానితో ఈ బుధవారం జరగబోయే మ్యాచ్ కి డేవిడ్ వార్నర్ దూరం అయ్యే అవకాశం ఉంది. ఇక ఆ మ్యాచ్ తర్వాత ఈయనకు గాయం తగ్గితేనే తర్వాత మ్యాచ్ లలో కూడా ఆడే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆప్స్ కి వెళ్ళాలి అంటే ఇప్పటి నుండి చాలా మ్యాచులు గెలవాల్సి ఉంది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాంటి ప్రదర్శనను రాబోయే మ్యాచ్ లలో కనబరుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: