ప్రస్తుతం ఐపీఎల్ పోరు హోరాహోరీగా జరుగుతుంది  ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో అందరూ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అయితే కొన్ని టీమ్స్ లో ఆటగాళ్ళు మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఎందుకో జట్టుకు అదృష్టం కలిసి రాక.. చివరికి ఓటమిపాలు అవుతూ ఉంది. ఇలా కొన్ని టీమ్స్ అంచనాలను తారుమారు చేస్తూ వరుస ఓటములతో నిరాశ పరుస్తూ ఉన్నాయి. అయితే ఈసారి ఐపీఎల్ సీజన్లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో అద్భుతంగా రాణిస్తుంది అనుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు మరోసారి చెత్త ప్రదర్శన చేస్తుంది.


 ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పా రాజస్థాన్ రాయల్స్ లో జరిగిన మ్యాచ్ లో కూడా ఇక బ్యాటింగ్లో తేలిపోయిన పంజాబ్ జట్టు చివరికి ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. కాగా ఇప్పుడు ఈ టీం గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది  సాధారణంగా ఒక జట్టుకి కెప్టెన్ వైస్ కెప్టెన్ ఎవరు అనే విషయంపై ఒక క్లారిటీ ఉంటుంది. కెప్టెన్ అందుబాటులో లేకపోతే తాత్కాలిక కెప్టెన్గా వైస్ కెప్టెన్ గా ఉన్న ఆటగాడు బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపిస్తాడు. కానీ పంజాబ్ కింగ్స్ లో మాత్రం శిఖర్ ధావన్ కెప్టెన్ అయినప్పటికీ వైస్ కెప్టెన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు  ఎందుకంటే తోలుత కెప్టెన్ శిఖర్ ధావన్ అందుబాటులో లేకపోవడంతో.  ఐపీఎల్ ట్రోఫీ ఫోటోషూట్ కి ఇక జితేష్ శర్మను వైస్ కెప్టెన్ గా పంపారు. అయితే ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో శిఖర్ ధావన్ ఆడలేదు. దీంతో ఆయన స్థానంలో సాం కరణ్ కెప్టెన్సీ చేపట్టాడు. దీంతో పంజాబ్ జట్టుకు వైస్ కెప్టెన్ గా జితేష్ శర్మ ఉన్నాడా లేకపోతే శ్యామ్ కరన్ ఉన్నాడ అనే విషయంపై కన్ఫ్యూషన్ నెలకొంది  ఈ విషయంపై ఆ జట్టు కోచ్ సంజయ్ బంగర్ స్పందించాడు. మా వైస్ కెప్టెన్ కరనే. కాకపోతే ఫోటోషూట్ సమయంలో అతను అందుబాటులో లేకపోవడంతో జితేష్ శర్మను పంపించాము అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: