ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే యూఎస్ వెస్టిండీస్ వేదికలుగా జరగబోయే వరల్డ్ కప్ లో తప్పకుండా టైటిల్ విజేతగా నిలవాలని అన్ని టీమ్స్ కూడా ఇప్పటినుంచి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. అత్యుత్తమ జట్టును బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే t20 వరల్డ్ కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.


 గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ వరకు ఓటమి ఎరుగని జట్టుగా దూసుకుపోయిన భారత జట్టు.. ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి టీమిండియా ఇక ఈసారి టి20 వరల్డ్ కప్ లో మాత్రం తప్పకుండా విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతుంది. అయితే జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది అనే విషయంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ లో రాణించిన ప్లేయర్లకు అటు వరల్డ్ కప్ జట్టులో పెద్దపీట వేసే అవకాశం ఉంది అని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే తమ అంచనా ప్రకారం వరల్డ్ కప్ జట్టులో ఎవరు చోటు తగ్గించుకుంటారు అనే విషయంపై ఎంతోమంది మాజీ ప్లేయర్లు ఇక టి20 వరల్డ్ కప్ జట్టును ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇదే రీతిలో టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ సైతం తన వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసాడు. ఈ టీంలో రింకు సింగ్ ను కాదని రియాన్ పరాగ్ కు చోటు కల్పించడం గమనార్హం. యశస్వి జైష్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్, బుమ్రా, హర్షదీప్, చాహల్, దూబే, పరాగ్, సిరాజ్ లకు తన టి20 వరల్డ్ కప్ టీంలో చోటు కల్పించాడు. అయితే అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్న రింకు సింగ్ మాత్రం తన టీం లోకి సెలెక్ట్ చేయలేదు మహమ్మద్ కైఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి: