ఐపీఎల్ 2024 లో భాగంగా ఇప్పటి వరకు చాలా మ్యాచులు పూర్తి అయ్యాయి. అందులో భాగంగా కొన్ని జట్లు అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్లు పట్టికలో మంచి స్థానంలో ఉంటే కొన్ని జట్లు పేలావమైన ప్రదర్శనతో చాలా అద్వాన స్థితిలో ఉన్నాయి. మరి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు..? ఎవరు ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశం ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఇప్పటి వరకు ఆరు మ్యాచులను ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐదు మ్యాచ్ లలో గెలుపొంది పది పాయింట్లు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత కోల్కతా జట్టు నాలుగు మ్యాచ్ లాంజ్ ఆడితే మూడింటిలో గెలుపొంది ఆరు పాయింట్ లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్ లలో మూడింటిలో గెలుపొంది 6 పాయింట్ల లతో మూడవ స్థానంలో ఉండగా ... లక్నో జట్టు ఐదింటిలో మూడింటిని గెలిచి ఆరు పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్లను అడగ అందులో మూడింటిలో గెలుపొంది ఆరు పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.


గుజరాత్ జట్టు ఆరు మ్యాచుల్లో మూడింటిలో గెలుపొంది ఆరు పాయింట్లతో ఆరవ స్థానంలో ఉండగా ... ముంబై జట్టు ఐదు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లలో గెలుపొంది నాలుగు పాయింట్లతో ఏడవ స్థానంలోనూ ... పంజాబ్ జట్టు ఆరు మ్యాచ్ లలో రెండింటిలో గెలుపొంది నాలుగు పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచుల్లో రెండింటిలో గెలిచే నాలుగో పాయింటులతో 9 వ స్థానంలోనూ ... బెంగళూరు జట్టు ఆరు మ్యాచుల్లో ఒక దాంట్లో గెలుపొంది రెండు పాయింట్లతో పదవ స్థానంలోనూ ఉంది. ఇక ఇప్పటి వరకు పాయింట్ల పట్టికను పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్ టీం ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl