టీమ్ ఇండియాలో తెలివైన స్పిన్నర్ గా పేరు సంపాదించుకున్నాడు  చాహల్. ఎవరికి ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు. అందుకే చాహల్ బౌలింగ్ చేస్తున్నాడు అంటే బ్యాట్స్మెన్లు కాస్త ఆచితూచి ఆడతారు. ఇక చాహల్ బౌలింగ్లో కేవలం కొంతమంది బ్యాట్స్మెన్లు మాత్రమే పరుగులు చేయడం చూస్తూ ఉంటాం. అలాంటి చాహల్ అటు టీమ్ ఇండియా తరఫున మాత్రమే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడిన చాహల్ ఇక ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీం కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మిగతా బౌలర్లతో పోల్చి చూస్తే చాహల్ వికెట్లు తీయడంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏకంగా 198 వికెట్లు తీసి రెండు వందల వికెట్ల మైలురాయిని అందుకునేందుకు చేరువలో ఉన్నాడు. కాగా ఇప్పటివరకు ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించాడు. అయితే ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఒక వికెట్ తీసి సత్తా చాటాడు. పరుగులను కూడా కట్టడి చేశాడు. కానీ చాహాల్ ఖాతాలో ఒక చెత్త రికార్డు వచ్చి చేరిపోయింది. చాహల్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీయడమే కాదు. ఇక ఎక్కువ సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్ గా కూడా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు అని చెప్పాలి.



 ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు ఇచ్చినా రెండవ బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు చాహల్. ఇప్పటివరకు 150 ఇన్నింగ్స్ లో 201 సిక్సర్లు సమర్పించుకున్నాడు చాహల్. అయితే అతని కంటే ముందు సీనియర్ బౌలర్ చావ్లా 184 ఇన్నింగ్స్ లో 211 సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్గా మొదటి స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. అయితే కొన్ని మ్యాచ్ లలో చాహల్ బౌలింగ్ ఎంతో కట్టుదిట్టంగానే ఉన్నప్పటికీ ఇంకొన్ని మ్యాచ్ లలో మాత్రం చాహల్ బౌలింగ్ లోనే బ్యాట్స్మెన్లు పరుగులతో విధ్వంసం సృష్టిస్తూ ఉతికి ఆరేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: