ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్  జట్టు ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం టీం కి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ప్రత్యర్థులపై ఆర్ టీం పూర్తిగా ఆధిపత్యం చెలాయించడంలో సక్సెస్ అవుతుంది కోల్కతా టీమ్. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లలో ఓడిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా నాలుగు విజయాలు సాధించింది  ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.


 ఇలా ఒకరకంగా ఫ్యాన్స్ అందరూ కూడా సంతృప్తి చెందే విధంగానే కోల్కతా జట్టు ప్రస్థానం కొనసాగుతోంది  కానీ ఒక విషయం మాత్రం అటు అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేస్తుంది  అదే ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఫామ్. ఐపీఎల్ హిస్టరీ లోనే ఎన్నడూ లేని విధంగా 24.75 కోట్లు ధర పెట్టి కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని జట్టులోకి తీసుకుంది. అయితే అతను అద్భుతంగా రాణిస్తాడని ఇక జట్టుకు టైటిల్ అందిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే కోల్కతా జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్న అందులో అతని పాత్ర మాత్రం శూన్యం అని చెప్పాలి.


 ఏకంగా ఈ సీజన్ తొలి నాలుగు మ్యాచ్లలో అతను కేవలం రెండే రెండు వికెట్లు తీశాడు. అంతేకాదు భారీగా పరుగులు కూడా సమర్పించుకుంటున్నాడు. దీంతో ఇతని కోసమా కోల్కతా ఇంత భారీ ధర పెట్టింది అంటూ కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అతనిపై వేటు వేయాలి అంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనిపై గౌతమ్ గంభీర్  స్పందించాడు. నాలుగు మ్యాచ్లలో రాణించనంత మాత్రాన స్టార్క్ చెత్త బౌలర్ కాదు. ఒక్కసారి ఫామ్ అందుకుంటే అతను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో అందరికీ తెలుసు. తదుపరి మ్యాచ్ లలో తప్పకుండా రానిస్తాడు అని నమ్మకం ఉంది అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: