రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ఎంత చెత్త ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వరకు ఏడు మ్యాచ్లు ఆడిన బెంగళూరు టీం కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి అభిమానులందరినీ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి కూడా టైటిల్ గెలవడం కష్టమేమో అనే భావన అభిమానులు కూడా కలుగుతూ ఉంది.


 ఎందుకంటే ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. అయితే బెంగళూరు జట్టు ఇలా వరుస పరాజుయాలతో సతమతం అవుతున్నప్పటికీ.. కొన్ని అరుదైన రికార్డులు మాత్రం ఇంకా ఆ జట్టు పేరిటే ఉన్నాయని అభిమానులు అనుకునేవారు. కానీ అలాంటి రికార్డులను కూడా ఇప్పుడు సన్రైజర్స్ బద్దలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అటు సన్రైజర్స్ ఆర్సిబి పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 277 పరుగులు చేసింది. అయితే ఇక ఈ రికార్డును మళ్ళీ తిరిగ రాసి ఆర్సిబి తో జరిగే మ్యాచ్లో 287 పరుగులు చేసింది సన్రైజర్స్. మరోవైపు ఓకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా ఆర్సీబీ పేరుతో ఉండేది.


 గతంలో ఆర్సిబీ ఓకే ఇన్నింగ్స్ లో 21 సిక్సర్లు బాదగా.. ఇటీవల ఆర్సిబి తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఓకే ఇన్నింగ్స్ లో 22 సిక్సర్లు  నమోదు చేసి రికార్డు బద్దలు కొట్టింది. ఇలా అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా బద్దలైన.. మరో సరికొత్త రికార్డు మాత్రం బెంగళూరు జట్టు  పేరిట చేరింది. లక్ష్య   చేదనలో 250 పరుగులు చేసిన తొలి టీమ్గా నిలిచింది ఆర్సిబి. దీంతో గతంలో పోటీనా 263 పరుగుల రికార్డులను ఇక ఈ స్కోర్ భర్తీ చేసినట్లు అయింది. అయితే నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చివరికి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘనవిజయాన్ని అందుకుంది.. దీంతో మరోసారి ఆర్సిబికి నిరాశ తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb