సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తుంది. మొన్నటి వరకు ఆ జట్టు ఎంత బాగా రాణించినప్పటికీ సన్రైజర్స్ టీంలో అటు బౌలింగ్ పటిష్టంగా ఉన్న బ్యాటింగ్ విభాగం మాత్రం ఎప్పుడు పేలవ ప్రదర్శన చేస్తుంది అని అనుకునే వారు అభిమానులు. తక్కువ పరుగులు చేసినప్పటికీ కేవలం బౌలింగ్ తోనే ఆ జట్టు ప్రత్యర్థులను కట్టడి చేసి విజయం సాధించగలదు అనుకునేవారు. అనుకోవడం అంటే గతంలో ఇదే జరిగింది. కానీ ఈ ఏడాది చూసుకుంటే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.


 మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే కేవలం బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్లో కూడా సన్రైజర్స్ ను మించిన టీమ్ మరొకటి లేదేమో అనిపిస్తుంది. ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతూ వస్తుంది. మరి ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉన్న ఐపిఎల్ హిస్టరీ లోనే అత్యధిక స్కోరు రీకార్డును కూడా ఇటీవల ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ బద్దలు కొట్టింది. ఏదో అదృష్టం కొద్ది ఈ రికార్డు బ్రేక్ చేసింది  మరోసారి సన్రైజర్స్ ఇలాంటి రికార్డు సాధించడం కష్టమే అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు  ఇక ఇప్పుడు వారి అందరి నోళ్లు మూయిస్తూ  మరోసారి సన్రైజర్స్ సొంత రికార్డు బద్దలు కొట్టింది. ఆర్ సి బి తో జరిగిన మ్యాచ్ లో  జరిగిన మ్యాచ్ 287 పరుగులు చేసింది.


 ఈ క్రమంలోనే మరోసారి ఐపీఎల్ హిస్టరీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉన్న మరో అరుదైన రికార్డును బద్దలు కొట్టింది. సన్రైజర్స్, ఆర్సిబి జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు నమోదు అయ్యాయి. సన్ రైజర్స్ ప్లేయర్లు ఏకంగా 22 సిక్సర్లు  కొట్టారు. అయితే ఐపీఎల్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్ లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ రికార్డు ఆర్సిబి పేరుతో ఉండేది. 2016లో పూణే వారియర్స్ పైన 21 సిక్సర్లు కొట్టింది ఆర్సిబీ  ఇక ఇప్పుడు అదే ఆర్సిబి తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఈ రికార్డును అధిగమించింది. ఇక ఇదే మ్యాచ్లో 287 పరుగులు చేసి ఐపిఎల్ హిస్టరీ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసి సొంత రికార్డును బద్దలు కొట్టింది హైదరాబాద్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: