ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వరుసగా మ్యాచ్లు ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ మ్యాచ్ లలోని పోరు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతుంది. ఇక ప్రతి టీం కూడా మ్యాచ్లలో భారీ స్కోర్లు నమోదు చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈసారి మునుపేన్నడు లేని విధంగా టైటిల్ పోరులో తీవ్రమైన పోటీ ఉంది. అయితే ఇలా మంచి ప్రదర్శన చేస్తున్న జట్ల కంటే చెత్త ప్రదర్శన చేస్తున్న ఒక టీం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.


 అదే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ప్రతిసారి ఈ సాలా కప్ నందే అనే నినాదంతో ఐపీఎల్ లో బరిలోకి దిగుతూ ఉంటుంది బెంగళూరు టీం. కానీ చెత్త ప్రదర్శనలతో ఎప్పుడూ నిరాశ పరుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో కూడా ఇదే ఆట తీరును కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఏకంగా 6 మ్యాచ్లు ఆడిన బెంగళూరు టీం.. ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. అయితే టైటిల్ గెలవడం గురించి దేవుడెరుగు కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగు పెడుతుందా లేదా అనే విషయంపై మాత్రం అనుమానాలు నెలకొన్నాయ్ అనేది తెలుస్తుంది.


 అయితే ప్రస్తుతం ఆర్సీబీ వరుస ఓటమిల గురించి అంతట చర్చ జరుగుతుంది. ఇక ఇదే విషయంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఆర్సిబి జెర్సీ ధరించడం వల్లే ఆ జట్టుకు అదృష్టం కలిసి రావట్లేదేమో అంటూ అభిప్రాయపడ్డారు. ఆర్సిబికి అనధికారిక దురదృష్టం తానే అంటూ చెప్పుకొచ్చాడు. అంతకుముందు పందెంలో డివిలియర్స్ తో చేతిలో ఓడిపోవడంతో స్కాట్ స్టైరిష్ ఆర్సిబి జెర్సీ ధరిస్తూ వస్తున్నారు. ఆయన జెర్సీ ధరించిన ఐదు మ్యాచ్లలో కూడా ఆర్సిబి ఓడిపోయింది. ఈ క్రమంలోనే స్కాట్ స్టైరిష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb