ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ పండుగ కొనసాగుతుంది  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్ కూడా ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యం పెట్టుకొని.. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా స్కోర్లు నమోదు అవుతూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారీ స్కోరు నమోదు కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించింది. క్రీజ్ లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా బెంగళూరు జట్టు బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు. ఎంత వైవిధ్యమైన బంతి సంధించిన బౌండరీకి తరలించడమే లక్ష్యంగా వీర బాదుడు బాదారు. ఇక వారి బాదుడికి ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగుల రికార్డు  277 పరుగుల రికార్డు బద్ధులైంది. ఏకంగా ఈ మ్యాచ్ లో 287 పరుగులు నమోదు చేసింది సన్రైజర్స్. ఇక ఇంత భారీ స్కోరు నమోదు చేయడం అటు బెంగళూరు టీం కి అసాధ్యమే అని అనుకున్నారు అందరూ. అయితే వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో భారీ తేడాతో బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడిపోతుందని భావించారు. కానీ ఆ తర్వాత ఆర్సీబీ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ సృష్టించిన  విధ్వంసంతో అభిమానుల్లో మళ్ళీ గెలుపు పై ఆశలు చిగురించాయి. కాని చివర్లో అతను ఔట్ కావడంతో మళ్ళీ బెంగళూరుకు ఓటమి తప్పలేదు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 40 ఓవర్లలో రెండు టీమ్స్ కలిపి 549 పరుగులు చేశాయి. సన్రైజర్స్ ఆర్సిబి జట్లు భారీ స్కోర్ చేయడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. సన్రైజర్స్ ఆర్సిబి పవర్ హిట్టింగ్తో అద్భుతమైన ప్రదర్శన చేశాయి. 40 ఓవర్ లలో ఇరు జట్లు 549 పరుగులు చేశాయి. ఇలా చేస్తే బౌలర్ అవ్వాలని ఎవరు అనుకుంటారు అంటూ సచిన్ టెండూల్కర్ ఒక పోస్ట్ పెట్టగా ఇది కాస్త వైరల్గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: