మరికొన్ని రోజుల్లో టీం ఇండియా ముందు ఒక సవాల్ ఉండబోతుంది. అదే జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేయడం. అయితే టీమిండియాలో ఎప్పుడు వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేయాలన్న ఎంత తీవ్రమైన పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది ఆటగాళ్లు వరల్డ్ కప్ లో చోటు కోసం అంతకు ముందు నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసి సెలెక్టర్ల చూపును ఆకర్షిస్తూ ఉంటారు. దీంతో వారిలో ఎవరిని తీసుకోవాలి అనే విషయంపై ఎప్పుడు సేలెక్టర్లకు తలనొప్పి ఉంటుంది.


 అయితే ఇక ఈ ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక విషయంలో కూడా సెలెక్టర్లకు ఇలాంటి సవాల్ ముందుంది అన్నది తెలుస్తుంది. మరరీ ముఖ్యంగా ఇక టి20 వరల్డ్ కప్ లో వికెట్ కీపర్ గా ఎవరిని తీసుకుంటారు అనే విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే టీమిండియాలో యంగ్ వికెట్ కీపర్ లుగా కొనసాగుతున్న ఇషాన్ కిషన్, సంజు శాంసన్, రిషబ్ పంతులు ముగ్గురు కూడా అదరగొడుతున్నారు. ఇక కీపింగ్ నైపుణ్యం లోనే కాదు బ్యాటింగ్ లో కూడా ఇరగదీస్తున్నారు.  దీంతో ఈ ముగ్గురిలో టి20 వరల్డ్ కప్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు.


 టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే జట్టులో రిషబ్ పంత్ కు తప్పకుండా చోటు కల్పించాలి అంటూ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లు కూడా ప్రస్తుతం అద్భుతంగా ఆడుతున్నారు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అయినప్పటికీ ఒకవేళ నేనే టీమిండియా సెలెక్టర్ అయితే కచ్చితంగా రిషబ్ పంతుని సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే అతను ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడో అందరికీ తెలుసు. అందుకే భారత టీ20 వరల్డ్ కప్ జట్టులో తప్పకుండా రిషబ్ పంత్ ఉండాలి అనేది నా అభిప్రాయం అంటూ రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl