(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రస్తుతం ఎంతో రసవత్తనంగా ముందుకు సాగుతుంది. ఒక మ్యాచ్ లో భారీ స్కోరు వస్తూ ఉంటే ... మరొక మ్యాచ్ లో పెద్దగా స్కోర్లు ఏమి రావడం లేదు. ఇలా రోజుకో పరిణామాల మధ్య మ్యాచ్ లు నడుస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ రోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మొదలు అయ్యింది.

ఈ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ మొదటగా బ్యాటింగ్ చేసింది. ఈ జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరును ఢిల్లీ ముందు ఉంచుతుంది అని ఈ జట్టు అభిమానులు ఆశించారు. కానీ వారి ఆశలను ఈ జట్టు ఏ మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు మొదటి నుండే వికెట్ లను నష్టపోవడం మొదలు పెట్టింది. దానితో ఈ జట్టుకు పెద్దగా స్కోర్ కూడా రాలేదు. ఇక చివరకు ఈ జట్టు 89 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇది ఇప్పటికీ వరకు "ఐ పీఎల్" చరిత్రలో గుజరాత్ టైటాన్స్ కి ఇది ఇక చెత్త రికార్డు.

ఇదే వీరి కెరియర్ లో అత్యల్ప స్కోర్. ఇక ఇది వరకు గుజరాత్ టైటాన్స్ లియెస్ట్ స్కోర్ 125 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోవడం. ఈ జట్టు 100 పరుగుల లోపు ఆల్ అవుట్ కావడం ఇదే మొదటి సారి. ఇక ఇన్ని రోజుల పాటు చెత్త రికార్డుకు చాలా దూరంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ ఈ రోజు మాత్రం ఘోరమైన ఇన్నింగ్స్ తో ఓ పెద్ద చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ లను ఆడిన గుజరాత్ టైటాన్స్ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే గెలుపొంది ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో కింది నుండి నాలుగవ స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gt