ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది అంటే చాలు అనేక పాత రికార్డులు పోయి కొత్త కొత్త రికార్డులు పుట్టుకుంటూ వస్తూ ఉంటాయి. ఇక కొన్ని అద్భుతమైన రికార్డులను జట్లు నెలకొల్పుతూ ఉంటే మరికొన్ని చెత్త రికార్డులను కూడా కొన్ని టీమ్స్ తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటాయి. ఇకపోతే ఈ రోజు మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక గొప్ప రికార్డును నెలకొల్పింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకి మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసింది. ఇందులో భాగంగా ఈ జట్టు 17.3 ఓవర్లు ముగిసే సరికి 10 వికెట్లు కోల్పోయి కేవలం 89 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఆ తర్వాత 90 పరుగుల తక్కువ టార్గెట్ తో బ్యాటింగ్ లోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 8.5 ఓవర్ లలో నాలుగు వికెట్లు నష్టానికి 92 పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా ఈ రోజు మ్యాచ్ లో భాగంగా గుజరాత్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకో 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో ఇప్పటి వరకు 17 ఏళ్ల (ఐ పీ ఎల్) చరిత్రలో బంతుల పరంగా ఢిల్లీ కి ఇదే అతి పెద్ద విజయం. ఇంతకు ముందు 2022 లో పంజాబ్ కింగ్స్ పై 57 బంతులు మిగిలి ఉండగానే ఈ జట్టు గెలిచి అప్పుడు రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ జట్టు గుజరాత్ పై అద్భుతమైన విజయాన్ని అందుకొని మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి నుండి ఢిల్లీ మెరుగైన ప్రదర్శనను కనబరిస్తేనే ప్లే ఆప్స్ కి చేరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl