గత కొంతకాలం నుంచి ఐపిఎల్ టోర్నీలో బాగా మారు మోగిపోతున్న పేరు ఏదైనా ఉంది అంటే అది సునీల్ నరైన్ పేరు అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు అతను ఒక బౌలర్  గా మాత్రమే అందరికీ తెలుసు. ఇక అప్పుడప్పుడు పార్ట్ టైం బ్యాటర్ గా కూడా కనిపిస్తూ ఉంటాడు. కానీ అతను స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ల కంటే విధ్వంసం సృష్టించగలడు అన్న విషయం ఇక ఈ ఐపీఎల్ సీజన్లో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తూ వరుసగా శతకాలతో చెలరేగిపోతున్నాడు. మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.


 గౌతమ్ గంభీర్ ఏకంగా ఈ బౌలర్ ని ఓపెనర్ గా బరీలోకి దింపడం ఇక బౌలర్ అయిన సునీల్ నరైన్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా మెరుపు ఓపెనింగ్స్ లతో అదరగొడుతూ ఉండడం ఇక ప్రేక్షకులు అసలు నమ్మలేకపోతున్నారు. ఏకంగా తన కెరీర్లో మొదటి టీ20 శతకాన్ని కూడా నమోదు చేశాడు సునీల్ నరైన్. దీంతో ఇది నిజమా కల అన్న విషయం కూడా కొంతమంది అభిమానులకు అనిపిస్తూ ఉంటుంది  అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే సునీల్ నరైన్ తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు ఐపీఎల్ లో ఫామ్ చూసిన తర్వాత ఇక నరైన్ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయ్యాడట. తన రిటైర్మెంట్ విషయంలో యు టర్న్ తీసుకోబోతున్నాడట ఈ స్టార్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం  తిరిగి జాతీయ జట్టుకు ఆడేందుకు సిద్ధమవుతున్నాడట నరైన్. ఈ క్రమంలోనే జూన్ నెలలో ప్రారంభం కాబోయే t20 వరల్డ్ కప్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నాడట. కాగా నరైన్ ఐపీఎల్ 276 పరుగులతో పాటు ఏడు వికెట్లు కూడా పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: