అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ డిక్షనరీలో లేని కొన్ని రూల్స్ ని అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బీసీసీఐ ఆచరణలోకి తెస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా బీసీసీఐ తీసుకొచ్చే కొన్ని రూల్స్ అటు వరల్డ్ క్రికెట్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అయితే గత సీజన్ నుంచి కూడా ఐపిఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ ని తీసుకువచ్చింది బీసీసీఐ. ఈ రూల్ ప్రకారం రెండు టీమ్స్ కూడా ఆట మధ్యలో ఇక తమ టీం లోని ఆటగాడిని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఒకప్పుడు ఇలా సబ్ స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్ కేవలం ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం సబ్సిట్యూట్ గా వచ్చిన ఆటగాడు బౌలింగ్ బ్యాటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లోని ప్రతి మ్యాచ్ లో కూడా అన్ని టీమ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని వాడేస్తున్నాయి. ఇక ఒక ప్లేయర్ బ్యాటింగ్ పూర్తి కాగానే అతను స్థానంలో ఏకంగా స్పెషలిస్ట్ బౌలర్ ని జట్టులోకి తీసుకుంటూ ఉండడం గమనార్హం. అయితే ఈ రూల్ ఆయా టీమ్స్ కి బాగా ఉపయోగపడుతుంది. కానీ బౌలింగ్ ఆల్ రౌండర్ల కెరియర్ పై మాత్రం దెబ్బ పడుతుంది అని చెప్పాలి.


 ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా నష్టపోతున్న వారిలో అటు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ శివం దూబే కూడా ఉన్నాడు. అతను ప్రస్తుతం ఐపిఎల్ లో అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే t20 వరల్డ్ కప్ జట్టులో ఉండాలని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయ్. అతనికి ఇంపాక్ట్ ప్లేయర్  రూల్ కలవరపెడుతుంది. ఆరు మ్యాచ్లలో 242 పరుగులు చేసిన ఈ సీఎస్కే ఆటగాడు.. ఆ టీం తరఫున టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అయితే అతను ఫేస్ బౌలింగ్ కూడా చేయగలడు. కానీ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద బ్యాటింగ్ కి మాత్రమే పరిమితం చేస్తున్నారు. బౌలింగ్ చేయడానికి వీలు లేకుండా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కింద ఇక స్పెషలిస్ట్ బౌలర్ను  తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ రూల్ ప్రకారం అతను బౌలింగ్లో నిరూపించుకోలేకపోతున్నాడు. దీంతో అతనికి వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందో లేదో అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: