(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా ఇప్పటికే చాలా మ్యాచ్ లు పూర్తయ్యాయి . ఆ మ్యాచ్ లలో కొన్ని జట్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఉంటే ... కొన్ని జట్లు మాత్రం పేలవమైన ప్రదర్శన కనబరుస్తూ ఆ జట్టు యాజమాన్యానికి , ఆ టీం ను అభిమానించే ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్ని మిగులుస్తున్నాయి. ఇకపోతే ఈ సారి భారీ అంచనాల నడుమ సీజన్ లోకి అడుగు పెట్టిన జట్లలో ముంబై ఇండియన్స్ జట్టు ఒకటి.

ఈ జట్టు రోహిత్ శర్మ ను కాకుండా ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా ను కెప్టెన్ గా నియమించింది . హార్దిక్ పాండ్యా నేతృత్వం లో బరిలోకి దిగిన ముంబై జట్టు మొదట అపజాయలను ఎదుర్కొంది . కానీ ఈ జట్టు తిరిగి మళ్లీ ఫామ్ లోకి వచ్చి విజయాలను అందుకుం టుంది. ఇకపోతే నిన్న ముంబై జట్టు పంజాబ్ తో తలపడింది. ఇందులో ముంబై జట్టు పంజాబ్ పై గెలుపొందింది.

కాకపోతే ముంబై జట్టు కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యా కు మాత్రం ఓ భారీ జరిమానా పడింది. నిన్నటి మ్యాచ్ లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా ఈ జట్టు కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యా కు (ఐ పీ ఎల్) బోర్డ్ 12 లక్షల జరిమానాన్ని విధించింది. ఇకపోతే ఈ సీజన్ లో రిషబ్ పంత్ రెండు సార్లు ఈ జరిమానా భారిన పడగా ... గిల్ ఒక సారి ఈ జరిమానా బారిన పడ్డాడు. ఇలా ఇప్పటికే ఈ సీజన్ లో అనేక మంది స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా బారిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: