(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా మంచి ఆట తీరును కనబరిస్తూ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మంచి స్థానంలో ఉన్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్ మరియు లక్నో. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో ఆరు మ్యాచులు ఆడగా 4 మ్యాచ్ లలో గెలుపొంది 8 పాయింట్లు మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా ... లక్నో జట్టు ఆరు మ్యాచ్ లను ఆడి అందులో మూడింటిలో గెలుపొంది ఆరు పాయింట్లతో అయిదవ స్థానంలో ఉంది. ఇలా పాయింట్లు పట్టికలో ప్రస్తుతం మెరుగైన స్థానంలో ఉన్న ఈ రెండు జట్లు కూడా ఈ రోజు తలపడబోతున్నాయి.

ఈ రోజు చెన్నై , లక్నో మధ్య రాత్రి 7  గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు కూడా కీలకం గానే మారింది. ఎందుకు అంటే ప్రస్తుతం మంచి స్థానంలో ఉన్న ఈ రెండు జట్లు ఈ రోజు కనక విజయాన్ని అందుకున్నట్లు అయితే ప్లే ఆఫ్స్ కి చాలా దగ్గరగా వెళ్తారు. అందుకోసం అని ఈ రెండు జట్లు కూడా ఈ రోజు కచ్చితంగా విజయాన్ని దక్కించుకోవాలి అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ రెండు జట్ల విజయ అవకాశాల విశాయలను పక్కకు పక్కన పెడితే ... చాలా మంది ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ధోని ఇన్నింగ్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ లో ధోని చాలా తక్కువ బంతులు ఆడినప్పటికీ అద్భుతమైన స్కోర్ ని చేస్తున్నాడు. దానితో ఈ రోజు కూడా ధోని ఒక భారీ స్కోరును చేస్తాడు అని ... అతని ఇన్నింగ్స్ కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు ధోని ఎలాంటి ఆట తీరును కనబరుస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: