ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్) 2024 లో భాగంగా ఈ రోజు చెన్నై మరియు లక్నో ల మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులను చేసింది. ఇలా ఈ జట్టు మొదట బ్యాటింగ్ చేసి పరవాలేదు అనే టార్గెట్ ను లక్నో ముందు ఉంచింది. ఇక లక్నో 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. లక్నో మొదటి నుండి చాలా జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు పోకుండా పరుగులను రాబడుతూ వచ్చింది.

దానితో ఏ దశ లోనూ లక్నో , చెన్నై వైపు మ్యాచ్ ను వెళ్లకుండా చూసుకుంది. ఇక మెల్లి మెల్లిగా పరుగులు చేస్తూ వచ్చిన లక్నో 19 ఓవర్ లు ముగిసే సరికి కేవలం రెండు వికెట్ లను మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక మొదటి నుండి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో చెన్నై గెలుస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా చెన్నై కి షాక్ ఇచ్చి లక్నో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక పాయింట్లు పట్టికలో ఈ రెండు జట్ల పరిస్థితిని చూసినట్లు అయితే ఇప్పటి వరకు 7 మ్యాచ్ లను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 4 మ్యాచ్ లలో గెలుపొంది 8 పాయింట్ లతో పాయింట్ల పట్టికల 3 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా ... లక్నో ఇప్పటి వరకు 7 మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లలో గెలుపొంది 8 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఇకపోతే ఈ రెండు జట్లకు పాయింట్లు సమానం గానే ఉన్నప్పటికీ రన్ రేట్ విషయంలో చెన్నై చాలా మెరుగ్గా ఉండడంతో లక్నో కంటే కూడా పాయింట్ల పట్టికలో చెన్నై మంచి స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: