ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఎన్నో మ్యాచ్ లకి కెప్టెన్ గా వ్యవహరించి ఎన్నో విజయాలను అందించిన మిస్టర్ కూల్ ఎం ఎస్ ధోని ప్రస్తుతం (ఐపీఎల్) లో మ్యాచ్ లు ఆడుతూ ప్రేక్షకుల ,కు తన అభిమానులకు మంచి జోష్ ను ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంతమంది అయితే (ఐపీఎల్) ను ధోని ఉన్నాడు అనే వీక్షించే వారు కూడా ఉన్నారు. అలాంటి వారి కోసం ధోని కూడా తనదైన స్థాయిలో కష్టపడుతూ వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇకపోతే ధోని ఈ సీజన్ లో మాత్రం తన అద్భుతమైన ప్రదర్శనతో తన జట్టుకు మరియు తనను అభిమానించే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను ఇస్తున్నాడు.

ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే దాదాపుగా ధోని చాలా లేటుగా బ్యాటింగ్ కి వస్తూ ఉంటాడు. దానితో ఈయన చివరి ఓవర్లలోనే బ్యాటింగ్ కి దిగుతూ ఉంటాడు. అయినప్పటికీ ధోని చాలా తక్కువ బంతుల్లో ఈ సీజన్ లో చాలా ఎక్కువ పరుగులను సాధిస్తూ వస్తున్నాడు. చెన్నై ఈ రోజు లక్నో తో తలపడిన విషయం మన అందరికీ తెలిసిందే. మొదటి నుండి కూడా ఈ రోజు మ్యాచ్ లో ధోని అద్భుతమైన బ్యాటింగ్ చేస్తే చూడాలి అని ఎంతో మంది అనుకున్నారు. అలాంటి ప్రదర్శననే ధోని ఈ రోజు చూపించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరును ఏమీ నమోదు చేయలేదు. ఈ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి కేవలం 176 పరుగులు మాత్రమే చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో ధోనీ మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. కేవలం 9 బంతుల్లోనే 3 ఫోర్లు ,  2 సిక్సర్లతో 28 పరుగులకు రాబట్టాడు. ఇకపోతే ఇందులో ధోని కొట్టిన ఒక సిక్సర్ 101 మీటర్ల దూరంలో పడింది. ఇలా ఈ రోజు మాత్రం ధోనీ తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులకు ఫుల్ జోష్ ను నింపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: