2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు  ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా అటు హార్దిక్ పాండ్యా పై తీవ్రస్థాయిలో  విమర్శలు వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ అభిమానులు కొంతమంది హార్థిక్ పాండ్యను విమర్శిస్తుంటే ఇంకోవైపు హార్దిక్ అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా విఫలమవుతూ ఉండడంతో ఈ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా తీసుకుంటున్న నిర్ణయాలు ఇక మాజీ కెప్టెన్ రోహిత్ పట్ల అగౌరవంగ వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆగ్రహానికి గురి చేస్తూ ఉండడంతో విమర్శలు మరింత ఎక్కువవుతున్నాయ్. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్ లో రోహిత్ తీసుకున్న ఒక నిర్ణయం కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయితే ఈసారి కేవలం నేటిజన్స్ మాత్రమే కాదు ఆ జట్టులోని ఆటగాడే హార్దిక్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేయడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల ముంబై ఇండియన్స్ పంజాబ్  కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


 అయితే ఈ మ్యాచ్ లో మహమ్మద్ నబీ కి అటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఇవ్వలేదు. ఈ విషయంపై అతని అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్.. మీ కెప్టెన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా వింతగా ఉంటాయి. ఇతరులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. నబి ఈరోజు బౌలింగ్ చేయలేదు. తను గేమ్ చేంజర్. కీలక సమయంలో రెండు క్యాచ్ లు, ఒక రనౌట్ చేశాడు అని ఒక పోస్ట్ పెట్టాడు మహమ్మద్ నబి ఫ్యాన్. అయితే ఇక ఇదే పోస్టుని మహమ్మద్ నబీ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒకరకంగా హార్దిక్ నిర్ణయం పై తాను కూడా అసంతృప్తితోనే ఉన్నా అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు మహమ్మద్ నభి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl