పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత అందరికి తెలిసే ఉంటుంది. ఇంట్లో ఎంత మంచి పరమాన్నాలు వండిన పొరుగు ఇంట్లో ఉండే పుల్లకూర అన్నింటికంటే రుచిగా అనిపిస్తుంది అని దీనికి అర్థం వస్తూ ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కొన్ని ఫ్రాంచైజీల విషయంలో కూడా ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ ని పెద్దగా పట్టించుకోని ఫ్రాంచైజీలు ఏకంగా విదేశీ ప్లేయర్లకు మాత్రం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయ్. సరే కోట్ల రూపాయలు పెట్టిన ప్లేయర్లు జట్టులోకి వచ్చిన తర్వాత మంచి ప్రదర్శన చేస్తున్నారా అంటే పెట్టిన ధరకు ఎక్కడ న్యాయం చేయని పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక్క టీంలోనేనా ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్న అన్ని టీమ్ లలో కూడా పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. కేవలం లక్షల రూపాయల ధర పలికిన టీమిండియా యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంటే.. కోట్ల రూపాయల ధర పలికి రికార్డులు సృష్టించిన విదేశీ ప్లేయర్లు మాత్రం చేత ప్రదర్శనలతో నిరాశ పరుస్తున్నారు. ఇక పంజాబ్ కింగ్స్ జట్టును చూస్తే ఇది బాగా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే 36.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ముగ్గురు ప్లేయర్లు కలిపి 333 పరుగులు చేస్తే.. కేవలం 40 లక్షలతో కొనుగోలు చేసిన ఇద్దరు యువ ఆటకాలు 343 పరుగులు చేయడం గమనార్హం.


 ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్న బెయిర్ స్ట్రో, శ్యాంకరణ్, లివింగ్ స్టోన్ కోసం ఆ జట్టు ఏకంగా 36.75 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టింది. ఇక భారీ ధర పెట్టి ఈ ముగ్గురు ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది. కానీ వారి నుంచి ఇప్పటివరకు అంతంత మాత్రం ప్రదర్శన మాత్రమే వచ్చింది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లలో కలిపి కేవలం 33 పరుగులు మాత్రమే ఈ ముగ్గురు కలిసి చేశారు. అయితే కేవలం 40 లక్షలు మాత్రమే పెట్టి కొనుగోలు చేసిన దేశీయ ఆటగాళ్లు అశుతోష్ శర్మ, శశాంక్ లు 343 పరుగులు చేశారు. ఇది తెలిసిన ఫ్యాన్స్ విదేశీ క్రికెటర్ల పై కోట్లు వెదజల్లకుండా ఇక ఇలాంటి ఆణిముత్యాలను గుర్తించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl