గత ఏడాది ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా వరల్డ్ కప్ లో దూసుకొచ్చిన టీమిండియా ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే ఈ ఏడాది జూన్ నెలలో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో మాత్రం సత్తా చాటాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇకఆటగాళ్లు ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటుంది. మరి ముఖ్యంగా వికెట్ కీపింగ్ బ్యాటర్ కోసం టీమిండియా వెతుకుతుంది. ప్రస్తుతం భారత జట్టుకు ఎన్నో ఆప్షన్స్ ఉండగా ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆటగాడిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది.


 అయితే ఈ లిస్టులో సంజు, పంత్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి కంటే ఎక్కువగా ఆర్సిబి వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కు వరల్డ్ కప్ జట్టులోకి అవకాశం ఉంది అన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్లో ప్రస్తుతం అతను అదిరిపోయే ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని కూడా అద్భుతంగా ఆడుతూ ఉండడంతో అతన్ని వరల్డ్ కప్ ఆడించేందుకు ఒప్పించాలి అంటూ డిమాండ్లు వస్తున్నాయ్. ఇదే విషయంపై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.


 ధోని, దినేష్ కార్తీక్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా దినేష్ కార్తీక్ ఆడిన కొన్ని ఇన్నింగ్స్ లు చూసి నేను షాక్ కి గురయ్యాను. చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. ధోని కూడా అంతే.చివరి 4 బంతులు ఉన్నప్పుడు మహి వచ్చి బ్యాటింగ్ చేసిన విధానం మామూలుగా లేదు. ఆ మ్యాచ్లో మహి బాయ్ చేసిన ఆ పరుగుల వల్లే మేము ఓడిపోయాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టిండీస్ వచ్చి టి20 ఆడమని ధోనిని అడగడం.. ఆయనను ఒప్పించడం కష్టమే. అతను ఇప్పటికే చాలా క్రికెట్ ఆడాడు. అలసిపోయాడు  అయితే మహి కూడా మాతో పాటు అమెరికా వస్తున్నారు. కానీ వేరే పని కోసం  అందుకే మహీని ఒప్పించడం కంటే దినేష్ కార్తీక్ ని ఒప్పించడం ఎంతో ఈసి. వరల్డ్ కప్ కోసం వస్తావా అంటే హ వచ్చేస్తా అని ఫ్లైట్ ఎక్కేస్తాడు డీకే అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: