ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మునుపేన్నడు లేని విధంగా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. జట్టులోని అందరు ఆటగాళ్లు కూడా ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే బ్యాటింగ్లో బౌలింగ్ లో కూడా ఇక పటిష్టంగా కనిపిస్తూ ప్రత్యర్థులను భయపెడుతుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. మరీ ముఖ్యంగా బ్యాట్స్మెన్లు అటు ప్రతి మ్యాచ్ లో సృష్టిస్తున్న విధ్వంసం గురించి అయితే ఎంత చెప్పుకున్న తక్కువే. స్కోర్ బోర్డుకు సైతం అలుపు వచ్చేలా ఇక పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి మ్యాచ్లో 200కు పైగా పరుగులు చేస్తూ అదరగొడుతున్నారు.


 బౌలర్ ఎవరైనా సరే ఎక్కడ బంతి వేసిన సరే భారీ సిక్సర్లు బాదుతూ అందరికీ ముచ్చెమటలు పట్టిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో అయితే అటు సన్రైజర్స్ ఆటగాళ్లు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఓపెనర్ గా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు మొదటి బంతి నుంచి సిక్సర్ల సునామీ సృష్టించడం మొదలుపెట్టారు. ఇక ప్రతి బంతిని కూడా అటు స్టేడియం బయటకి  తరలించేందుకే కొట్టాము అన్నట్లుగా సిక్సర్లతో చెలరేగిపోయారు అని చెప్పాలి. దీంతో ఎక్కడ బంతి వేయాలో తెలియక అటు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు తలలు పట్టుకున్న పరిస్థితి ఏర్పడింది.


 అయితే ఇలా సన్రైజర్స్ బ్యాట్స్మెన్లు సిక్సర్ల సునామీ సృష్టిస్తున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బౌండరీల బయట ఉండి బాల్స్ అందించే బాల్ బాయ్స్ ఏకంగా సన్రైజర్స్ ఆటగాళ్ల సిక్సర్లకు బెబ్బెలేత్తిపోయారు. దీంతో రక్షణ కోసం హెల్మెట్లు ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇలా బాల్ బాయ్స్ హెల్మెట్స్ ధరించడం చూస్తేనే ఇక అక్కడ ఎంతటి విధ్వంసం జరిగిందో అర్థం అవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సేఫ్టీ ఫస్ట్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై సన్రైజర్స్ హైదరాబాద్ టీం 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl