ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లోనే మోస్ట్ అన్ లక్కీ టీం గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ జట్టులో ఉన్నంత మంది స్టార్ ప్లేయర్స్ మిగతా టీమ్స్ లో అసలు కనిపించరు. అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న మహా ప్లేయర్లందరూ కూడా అటు బెంగళూరు టీం లోనే దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ ఎందుకో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం 17 ఏళ్ల ఐపిఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ప్రతిసారి ఇక టైటిల్ గెలుస్తుంది అనే అంచనాలతో బరిలోకి దిగుతూ నిరాశ పరుస్తూ ఉంటుంది.


 మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే టైటిల్ వేటలో ఎప్పుడు వెనక పడుతూనే ఉంటుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే2024 ఐపీఎల్ సీజన్లో కూడా ఇదే జరుగుతుంది.అయితే ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సిబి ఉమెన్స్ టీం టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇదే జోష్లో ఐపీఎల్ లో పురుషుల టీం కూడా టైటిల్ గెలుస్తున్నాను అందరు అనుకున్నారు. కానీ మునుపటి కంటే దారుణంగా ఈసారి అభిమానులను నిరాశ పరుస్తుంది ఆ జట్టు. ఇప్పటివరకు ఏకంగా 8 మ్యాచ్ లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం ఒకే ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. దీన్ని బట్టి ఆ జట్టు ప్రస్థానం ఎంత చెత్తగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇక చివరి నుంచి మొదటి స్థానంలో అంటే అట్టడుగున కొనసాగుతుంది. అయితే ఏదైనా జట్టు ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే 16 పాయింట్లు ఉండాలి. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరన ఉన్న ఆర్సిబికి అటు ప్లే ఆఫీస్ కి వెళ్లే అవకాశాలు లేవు అని అందరికీ అర్థమైంది. అయితే ఇంకా ఆర్సీబీకి ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయట. మిగిలిన ఆరు మ్యాచ్లలో భారీ మార్జిన్ తో గెలిచిన 14 పాయింట్లే ఉంటాయి. కాబట్టి ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలు లేవు. కానీ అదృష్టం కలిసి వస్తే మిగతా టీమ్స్ గెలుపు ఓటమిల కారణంగా ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయట. మిగతా టీమ్స్ భారీ తేడాతో ఓడిపోవడం లేదంటే మ్యాచ్లు రద్దవడం జరిగితే ఏదైనా అద్భుతం జరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl