ఐపీఎల్ ద్వారా అదిరి పోయే ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యం గా బీసీసీఐ ఎప్పటికప్పుడు ఐపిఎల్ లో కొత్త రూల్స్ తీసుకువస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో లేని ఎన్నో కొత్త రూల్స్ ని కూడా బీసీసీఐ తీసుకువచ్చింది. ఇలాంటి రూల్స్ లో అటు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఒకటి. సాధారణంగా ఐసిసి రూల్స్ ప్రకారం సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్ కేవలం ఫీల్డింగ్ చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం ఇలా సబ్సిట్యూట్ గా వచ్చిన ప్లేయర్.. ఫీల్డింగ్ మాత్రమే కాదు బౌలింగ్ బ్యాటింగ్ కూడా చేయొచ్చు. ఇక ఒక ఆటుగాడు బ్యాటింగ్ పూర్తయిన వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా మైదానం బయటికి వెళ్లిపోవడం ఇక కొత్తగా జట్టులోకి బౌలర్ రావడం జరుగుతుంది   అయితే ఈ రూల్ కారణంగా బౌలింగ్ ఆల్రౌండర్లకి అన్యాయం జరుగుతుంది అంటూ గత కొంతకాలం నుంచి వాదన వినిపిస్తుంది. ఈ రూల్ విషయంలో బీసీసీఐ ఒకసారి పునరాలోచించుకోవాలి అంటూ క్రికెట్ విశ్లేషకులు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన టీమిండియా ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ సైతం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలను తొలగించాలి అంటూ డిమాండ్ చేశాడు మహమ్మద్ సిరాజ్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలి బౌలర్లకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది.  బ్యాట్స్మెన్లు రాగానే విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ 270- 280 పరుగులు పరిపాటిగా మారిపోయాయి అంటూ మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక అతను చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై అంతకంతకు విమర్శలు పెరిగిపోతున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: