ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి టీంలలో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియాకు గత కొన్నెళ్ల నుంచి అటు వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది ఒక కలగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో 2011లో ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. అప్పటినుంచి ఇప్పటివరకు పలుమార్లు సెమీఫైనల్, ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ ఇక వరల్డ్ కప్ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది అని చెప్పాలి. ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ అదరగొడుతూ ఉంటుంది.


 కానీ ఎందుకో కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం చెత్త ప్రదర్శన చేస్తూ నిరాశ పరుస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక జూన్ నెలలో ప్రారంభం కాబోయే t20 వరల్డ్ కప్ లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఓడిన జట్టు ఈసారి మాత్రం ఎలాంటి తప్పులు చేయకుండా అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలని అనుకుంటుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఐపిఎల్ ఆధారంగానే జట్టును సెలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో  ఎవరికి టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఐపీఎల్ సన్రైజర్స్ విధ్వంసకర  ఓపెనర్ అభిషేక్ శర్మ రాజస్థాన్ బ్యాటింగ్ సెన్సేషన్ రియాన్ పరాగ్ లు అదరగొడుతున్నారు. అభిషేక్ ఏడ మ్యాచ్లలో 215.96 స్ట్రైక్ రేటుతో 257 పరుగులు చేసి ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇక రియాన్ పరాగ్ ఏడు మ్యాచ్లలో 161.42 స్ట్రైక్ రేటుతో 318 పరుగులు చేసి రాజస్థాన్ విజయాలలో కీలకపాత్ర వహిస్తున్నాడు. దీంతో ఇద్దరికీ వరల్డ్ కప్ షెడ్యూల్లో చోటు దక్కుతుంది అనే చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl