ప్రస్తుతం ఇండియా లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి కొనసాగుతోంది. ఇక ఎక్కడ చూసినా కూడా క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా మ్యాచ్ చూస్తూ తెగ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇండియా మొత్తం క్రికెట్ పండుగ జరుగుతుంది అని చెప్పాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు టీవీలకు అతుక్కు పోయి క్రికెట్ మ్యాచ్లను వీక్షిస్తూ ఉన్నారు. ఇంకొంత మంది ఇది నేరుగా స్టేడియం కు వెళ్లి మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలి అనే లక్ష్యం తో అటు తెగ కష్టపడి పోతున్నాయి అన్ని టీమ్స్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా టైటిల్ గెలిచేందుకు తీవ్రంగా కష్టపడుతున్న కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయ్. ఎందుకంటే జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ చివరికి  జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొన్ని టీమ్స్ కి ఇక వ్యక్తిగత కారణాలతో ప్లేయర్లు ఇక జట్టుకు దూరమవుతున్నారు అని చెప్పాలి. ఇలా కీలకమైన ప్లేయర్లు జట్టుకు దూరమవుతున్న నేపథ్యం లో ఆయా టీమ్స్ యొక్క వ్యూహాలు తారుమారు అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే అడపాదడప విజయాలు సాధిస్తూ పరవాలేదు అనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. ఏకంగా ఆ టీం స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తొడ కండరాల గాయానికి చికిత్స కోసం అతను కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా కు వెళ్లారు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో ఇక ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కాగా ఈనెల మూడవ తేదీన కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చివరి సారిగా ఐపీఎల్ ఆడాడు మిచెల్ మార్ష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl