భారత జట్టుకు రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరు.. గత కొంతకాలం నుంచి ఇండియన్ క్రికెట్లో ఇదే విషయంపై చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు ఇక రోహిత్ తర్వాత కెప్టెన్లు అయ్యే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా సక్సెస్ కావడంతో అందరినీ వెనక్కినట్టే అతను కెప్టెన్సీ రేసులోకి ముందుకు వచ్చేసాడు.


 అయితే ఆ తర్వాత కాలంలో రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ కు విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా హార్దిక్ పాండ్యానే జట్టును ముందుకు నడిపిస్తూ వచ్చాడు అన్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు అంటే హార్దిక్ పాండ్యానే అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే కొన్నాళ్లపాటు టీం ఇండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో అటు శుభమన్ గిల్ పేరు కూడా వినిపించింది. ఇండియన్ క్రికెట్ లో యువరాజుగా పేరు సంపాదించుకున్న గిల్ తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్యా వెళ్లిపోయిన తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్ అదరగొడుతున్నాడు. దీంతో కెప్టెన్సీ రేసులో ఇక అతని పేరు మళ్లీ వినిపించడం మొదలుపెట్టింది. ఇదే విషయం గురించి టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు రోహిత్ శర్మ తర్వాత శుభమన్ గిల్ కెప్టెన్ కావచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు గిల్ సారథ్యం  భాగిస్తున్నాడు. రోహిత్తో కలిసి ఈ యంగ్ ఓపెనర్ భారత్ జట్టుకు అద్భుతమైన ఆరంభాలు కూడా ఇస్తున్నాడు. ఇక రానున్న రోజుల్లో ఇక రోహిత్ శర్మ రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమ్ ఇండియాకు గిల్ కెప్టెన్ గా మారే అవకాశం ఉంది అంటూ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: