2024 ఐపీఎల్ సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. యాక్సిడెంట్ కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలం పాటు  ప్రొఫెషనల్ క్రికెట్కు దూరంలో ఉన్న ఆ చెట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మళ్లీ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు   ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీలో బరిలోకి దిగింది ఢిల్లీ క్యాపిటల్స్  అయితే ఈసారి తప్పకుండా టైటిల్ గెలిచి తీరుతుందని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆ జట్టు పడుతూ లేస్తూ ప్రయాణాన్ని సాగిస్తోంది. పెద్దగా చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే టైటిల్ వేటలో కాస్త వెనకబడిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటఫై తీవ్ర విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇక తర్వాత మ్యాచ్ లలో పుంజుకుని అద్భుతంగా రానించాలి అని ఆ జట్టు ప్రణాళికలను సిద్ధం చేసుకున్న సమయంలో.. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ కి బిగ్ షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా జట్టు విజయాలలో కీలకంగా వ్యవహరిస్తాడు అనుకున్న మిచెల్ మార్ష్ ఇటీవలే ఇక గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మార్చి మూడవ తేదీన జరిగిన మ్యాచ్లో అతని చివరి మ్యాచ్ ఆడడు మళ్ళీ కోలుకొని జట్టులోకి వస్తాడు అనుకున్నప్పటికీ అది జరగలేదు.


 మిచెల్ మార్చ్ ఇలా ఐపీఎల్ టోర్నీకి మొత్తం దూరం కావడంతో అతని స్థానంలో ఇక మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇదే పనిలో నిమగ్నమైందట. అతని స్థానంలో సౌత్ ఆఫ్రికా విధ్వంసకర ఆటగాడు వండర్ డసన్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపిఎల్ 2024 మినీ వేలంలో అతను అమ్ముడుపోలేదు. అయితే ఇప్పుడు అతని బేస్ ప్రైజ్ రెండు కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా డాసేన్  గత పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఏడు మ్యాచ్లలోనే 364 పరుగులతో సెకండ్ లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl