ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంత హోరాహోరీగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సగంకి పైగా మ్యాచ్లు ముగిసాయి అని చెప్పాలి. ఇక ప్లే ఆఫ్ లో అడుగుపెట్టబోయే టీమ్స్ ఏవి అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అన్ని టీమ్స్ కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంలో హోరాహోరీగా పోరాటం కొనసాగిస్తూన్నాయ్. ప్రతి మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు నమోదు అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో 200 స్కోర్ నమోదయిందంటే అదే గొప్ప అనుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి మ్యాచ్ లో కూడా 200 స్కోర్ నమోదవుతున్నాయి. ఇక  రెండు టీమ్స్ కూడా 200 ప్లస్ స్కోర్లు నమోదు చేస్తూ ఉండడం గమనార్హం.


 దీంతో ఈ ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా మారిపోయింది. అయితే ఎంతోమంది ప్లేయర్లు అత్యుత్తమమైన ప్రదర్శన చేసి అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది ప్లేయర్లు చెత్త ప్రదర్శనలు కారణంగా ఇక ఎన్నో వరల్డ్ రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటూ ఉండడం గమనార్హం. కాగా ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగకుండా అద్భుతంగా రాణించిన ఢిల్లీ జట్టు.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో ఇరు జట్లు బ్యాట్స్మెన్లు పరుగుల ప్రవాహాన్ని కొనసాగించారూ అని చెప్పాలి.


 కాగా ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు.  ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా ఒక అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు అని చెప్పాలి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మోహిత్ శర్మ నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా తీయకుండానే 73 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో చెత్త రికార్డు అతని ఖాతాలో వచ్చి చేరింది. గతంలో ఈ రికార్డు బాసిల్ తంబి పేరిట ఉండేది. ఏకంగా అతను 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ రికార్డును మోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ఇక వీరి తర్వాత యష్ దయాల్ 69, రీస్ టాప్లే 68 పరుగులు ఇచ్చిన బౌలర్లుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl