సాధారణంగా ఏదైనా విదేశీ జట్టు ద్వైపాక్షిక  సిరీస్ ఆడటం కోసం భారత పర్యటనకు వచ్చింది అంటే.. ఇక ఆ విదేశీ ప్లేయర్లకు భారత క్రికెట్ బోర్డు ఇచ్చే ఆతిథ్యం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా స్టార్ హోటల్స్ కేటాయించి వారికి ఇష్టమైన ఆహారం అందుబాటులో ఉంచి ఎక్కడ ఏం తక్కువ కాకుండా చూసుకుంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి కూడా లగ్జరీ సదుపాయాలను విదేశీ క్రికెటర్లకు అందుబాటులో ఉంచుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఒక లగ్జరీ బస్సులో ఎక్కి ఫైవ్ స్టార్ హోటల్కు చేరుకుంటూ ఉంటారు క్రికెటర్లు.
 ఇక ఇలా హోటల్లో ఏం కావాలన్నా చేసేందుకు వీలు ఉంటుంది. అయితే బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు కాబట్టి ఇలా భారత పర్యటనకు వచ్చిన విదేశీ ఆటగాళ్ళకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచగలరు. కానీ ఇక పెద్దగా ఆదాయం లేని క్రికెట్ బోర్డులు ఇలాంటి ఆతిథ్యం ఇవ్వడంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కనీస సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచలేక విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు నేపాల్ క్రికెట్ బోర్డుపై కూడా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఏకంగా నేపాల్ పర్యటనకు వచ్చిన విండీస్ క్రికెటర్లకు కనీస సదుపాయాలు అందించలేకపోయింది ఆ దేశ క్రికెట్ బోర్డు.


 ఒకరకంగా వెస్టిండీస్ క్రికెటర్లకు దయనీయమైన స్వాగతం మాత్రమే దక్కింది. t20 సిరీస్ కోసం కాట్మండు లోనే టీఐయే విమానాశ్రయం చేరుకున్న వెస్టిండీస్ క్రికెటర్లకు సరైన స్వాగతం లభించలేదు  ఇక అంతకుమించి అక్కడ నుంచి హోటల్కు వెళ్లేందుకు లగ్జరీ బస్సులను కాదు ఏకంగా మినీ ట్రక్కులను ఏర్పాటు చేసింది నేపాల్ క్రికెట్ బోర్డు. ఇక ప్లేయర్లందరూ కూడా ట్రక్ లో తమ లగేజీని పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. దీన్ని బట్టి నేపాల్ క్రికెట్ బోర్డు ఆర్థిక దుస్థితి ఎంత దారుణంగా ఉందో దారుణంగా అర్థం చేసుకోవచ్చు అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెటర్లకు కనీసం భద్రత సదుపాయాలు కల్పించకపోవడం సరికాదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: