ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తుంది జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ గురించి. సాధారణంగానే టి20 ఫార్మాట్లో సాదా సీదా ద్వైపాక్షిక సిరీస్ లు జరిగితేనే..  క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో అటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహించే టి20 టోర్నీల ద్వారా కూడా క్రికెట్ మజా పొందగలుగుతున్నారు ప్రేక్షకులు. అలాంటిది ఇక టి20 ఫార్మాట్లో వరల్డ్ కప్ జరిగితే ఆ ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతూ ఉంటుంది అని చెప్పాలి.



 ఇలా క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా అసలు సరైన క్రికెట్ మజాని పంచేందుకు జూన్ నెలలో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఈసారి వరల్డ్ కప్ లో అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు. ఇక వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నయి అన్న విషయం తెలిసిందే.  అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సైతం వరల్డ్ కప్ పై అందరిలో ఆసక్తిని పెంచేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతోంది.


 అయితే ప్రతి వరల్డ్ కప్ కి ముందు ఒక అథ్లెట్ ను ప్రపంచ కప్ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుని ఇక వారితో ప్రమోషన్స్ చేయించడం చేస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అయితే జూన్ నెలలో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ అథ్లెట్ హుస్సేన్ బోల్ట్ ను నియమించింది ఐసిసి. ఈ మేరకు ఐసిసి ఇటీవల ఒక అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమాలలో హుస్సేన్ బోల్ట్ పాల్గొనబోతున్నాడు. జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుండగా.. వెస్టిండీస్ అమెరికా దేశాలు ఈ ప్రపంచకప్ టోర్నికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో మొత్తంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: