ఐపీఎల్ లో ఛాంపియన్ టీం గా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్ జట్టు. ఏకంగా ఐదు సార్లు టైటిల్ గెలిచిన టీం గా టాప్ లో ఉంది అన్న విషయం తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఐదు టైటిల్స్ గెలుచుకున్న జట్టుగా కూడా కొనసాగుతుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో తిరుగులేని జట్టుగా అవతరించింది ముంబై. కానీ గత కొన్ని ఐపీఎల్ సీజన్స్ నుంచి కూడా ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శనలతో తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తూ వస్తుంది. కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగు పెట్టకుండా లీగ్ దశతోనే సరిపెట్టుకుంటూ అటు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కనీసం కెప్టెన్ ను మార్చితే నైనా అదృష్టం కలిసి వస్తుందేమో అని భావించింది ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను సారధ్య బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యా చేతికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా కెప్టెన్సీ మార్పుపై  ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొత్త కెప్టెన్ తో అయిన ముంబై టీం బాగా రాణిస్తుంది అనుకుంటే మరింత చెత్త ప్రదర్శన చేసింది. ఐపీఎల్లో ఇప్పటివరకు 12 మ్యాచ్ లలో 3 మ్యాచులలో మాత్రమే విజయం సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది.


 ఇలా అయిదు సార్లు చాంపియన్ అయి ఉండి అత్యంత పేలవ ప్రదర్శన చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ముంబై జట్టులో కెప్టెన్సీ మార్పు వివాదం మరింత ముదిరింది అన్నది తెలుస్తుంది. హార్దిక్ పాండ్యా పై మిగతా ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. రోహిత్ శర్మ బుమ్రా సూర్య తదితర ఆటగాళ్లు కోచింగ్ సిబ్బందికి తమ అసంతృప్తిని తెలియజేసినట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్  తో మ్యాచ్ లో టాప్ స్కోరర్ అయిన తనను ఏకంగా ఓటమికి బాధ్యుడిని చేయడంపై యంగ్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ పాండ్యాతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇలా ముంబై ఇండియన్స్ టీమ్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: