ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ కెరియర్ చివరి దశలో ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం 37 సంవత్సరాలు ఉన్న రోహిత్ శర్మ ఏ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టీమిండియా లో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న రోహిత్.. ఇక మరో వరల్డ్ కప్ సమయానికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా కూడా . అయితే రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయం లో ఎప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది.


 విరాట్ కోహ్లీ లాగా ఫిట్నెస్ పై పెద్దగా దృష్టి పెట్టని రోహిత్ శర్మ ఇక త్వరగానే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే ప్రస్తుతం రోహిత్ కు ఉన్న ఫిట్నెస్ దృశ్య  అతను ఎప్పటి వరకు ఆడతారు అన్న విషయంపై కూడా స్పష్టత లేదు అని అందరూ అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఇదే విషయం గురించి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఫిట్నెస్ ట్రైనింగ్ గురించి ఎప్పుడు ఆలోచించని గొప్ప క్రికెటర్ అంటూ చెప్పుకొచ్చాడు.


 ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి ఆలోచించడం మొదలుపెడితే 50 ఏళ్ల వరకు కూడా క్రికెట్ ఆడతాడు అంటూ యోగ్రాజ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటలో వయస్సు గురించి మాట్లాడటంలో అర్థం లేదని.. 40 నుంచి 45 ఏళ్ల వయసులో ఫిట్గా ఉండి మంచి ఫామ్ కొనసాగిస్తూ క్రికెట్ ఆడితే తప్పేంటి అంటూ వ్యాఖ్యానించాడు. క్రికెట్ లో వయస్సు అనే అంశాన్ని రద్దు చేయాలి అంటూ సూచించాడు యోగ్రాజ్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: