ఇంటర్నేషనల్ క్రికెట్లో లేని ఎన్నో రకాల రూల్స్ అటు బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి రూల్స్ లో అటు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఒకటి. సాధారణంగా ఐసిసి రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు గాయపడినప్పుడు మరో ఆటగాడిని సబ్స్టిట్యూట్  గా జట్టులోకి తీసుకునేందుకు అవకాశం ఉండేది. ఇలా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే ఛాన్స్ ఉండేది. ఇక బ్యాటింగ్ బౌలింగ్ చేసేందుకు వీలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో ఏకంగా జట్లు ఒక ప్లేయర్ ను మ్యాచ్ మధ్యలోనే స్వాప్ చేసుకోవచ్చు.


 బ్యాటర్ కావాలనుకుంటే బ్యాటర్ ను.. బౌలర్ కావాలనుకుంటే బౌలర్ ని ఇక మార్చుకునేందుకు అవకాశం ఉంది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఐపీఎల్ లో అన్ని టీమ్స్ కి బాగా ఉపయోగపడుతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ఇక తమ జట్టులోకి కొత్త ఆటగాళ్లను ఈ రూల్ ద్వారా తీసుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై ఎంతో మంది మాజీక్రికెటర్లు ప్రస్తుత క్రికెటర్లు కూడా ఇక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రూల్ కారణంగా అటు ఆల్రౌండర్లకు  అన్యాయం జరుగుతుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇలా అందరూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను తొలగించాలి అంటూ డిమాండ్ చేస్తుండగా.. టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి మాత్రం మరోలా స్పందించాడు.


 ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలు చేయడం మంచిదే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు మాజీ కోచ్ రవి శాస్త్రి. భారీ స్కోర్లు నమోదు అయినప్పుడు ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది అంటూ తెలిపాడు. గత ఏడాది ఐపిఎల్ సీజన్లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా చాలా మ్యాచులు చివరి వరకు ఉత్కంఠగా సాగాయి అంటూ గుర్తు చేశాడు. ఇలాంటి రూల్స్ కేవలం క్రికెట్లో మాత్రమే కాదు ఇతర ఆటల్లో కూడా ఉన్నాయి అంటూ గుర్తు చేశాడు రవి శాస్త్రి. ఇటీవల అశ్విన్ తో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl