ఇండియన్ క్రికెట్ టీం లో అత్యంత ప్రభావంతమైన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడే తన జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించడం మాత్రమే కాకుండా తన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన బ్యాటింగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని మన అందరికీ తెలిసిందే. దాదాపుగా టీమిండియాలో ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఉండే రోహిత్ శర్మ మొదటి నుండి కూడా అటాకింగ్ గా బౌలర్సును ఎదుర్కొంటూ ఉంటాడు.

వికెట్ పోతుందా అనేది పెద్దగా ఆలోచించకుండా భారీ షాట్ లను ఆడుతూ ఉంటాడు. దానితో ఈయన క్రీజ్ లో ఉంటే చాలా స్పీడ్ గా పరుగులు వస్తూ ఉంటాయి. ఇప్పటికే ఈయన తన అద్భుతమైన ఆటతో ఎన్నో 200 పరుగుల ఇన్నింగ్స్ లను కూడా ఆడాడు. ఇది ఇలా ఉంటే ఇంత గొప్ప ఆటగాడు కావడంతో ఈయన ప్రతి ఒక్క బౌలర్ ను చాలా సులువుగా ఆడతాడు అని అనుకుంటారు. కానీ రోహిత్ శర్మ కూడా ఒకరి బౌలింగ్ ను అడటంలో చాలా కష్టపడుతూ ఉంటాడట. ఆ విషయాన్ని తాజాగా రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. తాజాగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ... డేయిన్ స్టెయిన్ బౌలింగ్ ఆడడం నాకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది.

అప్పట్లో మ్యాచ్ కి వెళ్లే ముందు అతని బౌలింగ్ ఉంది అని తెలిస్తే 100 సార్లు ఆయన వీడియోలను చూసేవాణ్ణి. ఆయన బంతిని చాలా వేగంగా వేయడంతో పాటు స్వింగ్ కూడా చేస్తూ ఉంటారు. దానితో అతని బౌలింగ్ లో ఆడడం నాకు చాలా కష్టంగా అనిపించేది అని చెప్పాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ తాను ఇంకా కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడుతాను అని కూడా చెప్పాడు. అలాగే మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే టీ 20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరచాలి అని ఆశగా ఉందని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rs