ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సారి మంచి ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ జట్టు ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లలో అత్యధిక స్కోరులను సాధించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో 12 మ్యాచ్ లను ఆడింది. అందులో 7 మ్యాచ్ లలో గెలుపొందగా 5 మ్యాచ్ లలో ఓడిపోయి 14 పాయింట్స్ తో పాయింట్లు పట్టికలో 4 వ స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే ఇంకా ఈ జట్టుకు ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

అందులో ఈ రోజు ఈ జట్టుకు ఓ మ్యాచ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకి ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో కనుక సన్రైజర్స్ జట్టు గెలిచినట్లు అయితే 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన దశకు చేరనుంది. అలాగే దాదాపుగా ఈ జట్టు ఈ రోజు మ్యాచ్ గెలిచినట్లు అయితే ఈ సీజన్ లో ప్లే ఆఫ్ లోకి చేరిపోతుంది. దానితో ఈ రోజు మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఎంతో కీలకంగా మారింది. మరి ఈ ఉత్కంఠ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇకపోతే గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్ లను అడగా కేవలం  5 మ్యాచ్ లలో గెలుపొందగా ... ఏడ ఇంట్లో 7 మ్యాచ్ లలో ఓడిపోయి 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలో ఉంది. ఈ జట్టు గెలిచిన ఓడిన కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. కాకపోతే కేవలం ఈ జట్టు ఈ రోజు గెలిచినట్లు అయితే పాయింట్లు పట్టికలో కాస్త మెరుగైన స్థానానికి వెళుతుంది. మరి గుజరాత్ జట్టు మెరుగైన స్థానం కోసం ఈ మ్యాచ్ లో గెలవడం కోసం ప్రయత్నం చేయబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Srh