టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు అద్భుతమైన ఆట తీరతొ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇలాంటి ఆట తీరును కొనసాగించాడు కాబట్టి.. ఇక ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో బెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు  అందరిలా జట్టులోకి వచ్చి పోయే ఆటగాడిని కాదు చరిత్ర సృష్టించే ఆటగాడిని అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించాడు కూడా.


 అయితే ఇప్పుడు ఐపీఎల్ లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ఒకవైపు బెంగుళూరు జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్నప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం తన బ్యాటింగ్తో అదరగొడుతూ ఇక జట్టును విజయతీరాలకు నడిపించేందుకు వీరోచితమైన పోరాటం చేస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ కూడా కొనసాగుతూ ఉన్నాడు.  అయితే కోహ్లీ ఇలా భారీగా పరుగులు చేస్తున్న అతని స్ట్రైక్ రేట్ పై మాత్రం గత కొన్ని రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి.


 ఇలాంటి స్ట్రైక్ రేట్ తో విరాట్ కోహ్లీ టి20 వరల్డ్ కప్ లో ఆడితే భారత జట్టుకు నష్టమే తప్ప లాభంగా ఉండదు అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. కోహ్లీ క్రేజ్ లో ఉన్నంత సేపు ప్రత్యర్థులు విజయం పై ఆశలు వదులుకోవాల్సిందే అంటూ పాకిస్తాన్ మాజీ మిస్బా ఉల్ హక్ కామెంట్ చేశాడు. వరల్డ్ కప్ లో విరాట్ తో ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పవు. కోహ్లీ స్ట్రైక్ రేట్ విషయంలో చర్చలు అనవసరం. మ్యాచ్ ఎలా గెలిపించాలో అతడికి బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి ప్రత్యర్థి నైనా చేలరేకి ఆడగలడు. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే మేటి ఆటగాడు అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: