2024 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పై అభిమానులు అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే దాదాపు ఏడాదిన్నర పాటు అటు రోడ్డు ప్రమాదం బారిన పడి గాయాలతో సతమతమై క్రికెట్ కి దూరమైన ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్.. ఇక చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. ఢిల్లీ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి ఎంతో సమర్ధవంతంగా ముందుకు నడిపించాడు అని చెప్పాలి.


 అయితే కేవలం కెప్టెన్ గా మాత్రమే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా రిషబ్ పంత్ అదరగొట్టాడు. అయితే ఢిల్లీ జట్టు దూకుడు చూస్తే ఈసారి తప్పకుండా ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుందని టైటిల్ రేసులో మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే ముందు ఉంటుంది అని అభిమానులు అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని ఢిల్లీ జట్టు చివరికి కష్టకాలంలో పడింది. కనీసం ప్లే ఆఫ్ లో అయిన అడుగు పెడుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇటీవలే ఇక రిషబ్ పంత్ లి  ఒక బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపిఎల్ నుండి నిష్క్రమించింది.


 ఇటీవల గుజరాత్ టైటాన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. ఇక ఈ ఒక్క పాయింట్ తో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇలా సన్రైజర్స్ ప్లే ఆప్స్ కి అర్హత సాధించడంతో ఢిల్లీ టోర్ని నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు 14 పాయింట్లతో 5 స్థానంలో ఉంది. టాప్ 5 లో ఉన్న కేకేఆర్ రాజస్థాన్ సన్రైజర్స్ చెన్నై 14 పైగానే పాయింట్లు ఉన్నాయి. అలాగే ఈ జట్లకు తలో మ్యాచ్ మిగిలి ఉంది. దీంతో ఢిల్లీ నాకౌట్ నుండి నుంచి తప్పుకుంది. కాగా ఇక ఈనెల 18వ తేదీన జరగబోయే మ్యాచ్లో సీఎస్కే పై ఆర్సీబీ 18 పరుగులు తేడాతో గెలిస్తే లేదంటే 200 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేదిస్తేనే ఇక సిఎస్కే ను వెనక్కి నెట్టి ఆర్సిబి ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: