ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే భారత్లో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది. దాదాపు రెండున్నర నెలలుగా ఇక ఇలా క్రికెట్ మేనియాలోనే మునిగితేలుతూ ఉంటారు ప్రేక్షకులు. అయితే మార్చి 22వ తేదీన ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. కాగా ప్రస్తుతం ఐపీఎల్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే.


 ఇప్పటికే ప్లే ఆప్స్ లో అడుగుపెట్టిన మూడు టీమ్స్ ఏవి అనే విషయంపై క్లారిటీ వచ్చింది. అయితే నాలుగో స్థానంలో ఏ జట్టు చోటు సంపాదించుకుంటుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి. ఇక నేడు జరగబోయే మ్యాచ్ తో క్లారిటీ రాబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే సెమీఫైనల్ కి ముందు నేడు ఆర్సిబి, చెన్నై మధ్య క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి అటు బెంగళూరు టీం ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంది.


 అయితే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ గెలవని ఆర్సిబి.. ఈసారి మాత్రం కప్పు గెలవాలని పట్టుదలతో ఉంది. ఒకవేళ అదృష్టం కొద్దీ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టి.. ఆర్సీబీ కప్పు గెలవాలి అంటే ఏం చేయాలి అనే విషయంపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టైటిల్ కోసం గత పదహారేళ్లుగా ఆర్సిబి పోరాడుతూనే ఉంది. కానీ దురదృష్టం ఆ జట్టును వీడడం లేదు. ఈసారి బెంగుళూరు ప్లే ఆఫ్ కి చేరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. గత నాలుగు మ్యాచ్లలో ఆడిన కసితోనే సీఎస్కే పై కూడా ఆడాలి. జట్టు ఫామ్ లో ఉండడం కూడా ఆర్సీబీకి ఎంతగానో కలిసి వస్తుంది అంటూ బ్రియాన్ లారా కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb