టీమ్ ఇండియాకు త్వరలోనే కొత్త హెడ్ కోచ్ రాబోతున్నాడా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే అందరూ అవును అని అంటున్నారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ సమయంలోనే.. అటు ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. అయితే ఆయన కోచింగ్ లో అటు టైమ్ ఇండియా ఎంతో అద్భుతమైన ప్రస్థానం కొనసాగించిన నేపథ్యంలో.. రెండోసారి రాహుల్ ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా నియమించే అవకాశం ఉంది అని అందరూ భావించారు.


 కానీ మొదటిసారే కోచ్గా ఉండేందుకే అతి కష్టం మీద ఒప్పుకున్న రాహుల్ ద్రవిడ్ ఇక రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టేందుకు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. దీంతో టీమ్ ఇండియాకి కొత్త కోచ్ ను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవల బీసీసీఐ కొత్త హెడ్ కోచ్ కావాలి అంటూ ప్రకటన విడుదల చేసింది.సాలరీ సహా ఇతర అలవెన్స్ లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే టీమిండియా కొత్త కోచ్ ఇతనే అంటూ ఎంతో మంది పేర్లు కూడా తిరమీదికి వస్తున్నాయి. సీఎస్కే కోచ్ గా ఉన్న ఫ్లెమింగ్ భారత హెడ్ కోచ్ గా రాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.


 అయితే ఇక ఇప్పుడు మరో భారత మాజీ ప్లేయర్ పేరూ కోచ్ పదవీ రేసులోకి వచ్చేసింది అని చెప్పాలి. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ను నియమించేందుకు బీసీసీఐ ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై ఇప్పటికే బోర్డ్ అధికారులు గౌతమ్ గంభీర్ తో  సంప్రదింపులు కూడా జరిపినట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో కోల్కతా జట్టుకు మెంటర్గా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ టోర్నీ పూర్తయిన తర్వాత కోచ్ పదవి గురించి అతనితో బీసీసీఐ పూర్తిస్థాయి చర్చలు జరుపనుందట.  మరోవైపు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27వ తేదీతో గడువు ముగియనుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: