ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ముంబై ఇండియన్స్ అంటే ఒక బ్రాండ్. మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ప్రస్తానాన్ని కొనసాగించిన ఈ జట్టు ఎప్పుడు ప్రత్యర్థులను భయపెడుతూనే ఉంటుంది. ప్రతి ఐపీఎల్ సీసన్లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది. బరిలోకి దిగడమేనా అంచనాలకు మించి రాణిస్తూ ఇక టైటిల్ పోరులో ఇప్పుడు దూసుకుపోతూ ఉంటుంది. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు.. అద్భుతమైన ప్రదర్శన చేసింది.


 అతి తక్కువ సమయంలోనే ఐదు టైటిల్స్ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. కానీ అలాంటి ముంబై ఇండియన్స్ జట్టు ఇక ఇప్పుడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. కాగా రెండు మూడు సీజన్స్ నుంచి ప్రతిసారి విఫలమవుతూ ఇక చెత్త ప్రదర్శనలతో అందరికీ చిరాకు తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఇక 2024 ఐపీఎల్ సీజన్లోనూ ముంబై ఇదే ఆట తీరును కనబరిచింది. ఏకంగా 14 మ్యాచ్ లలో కేవలం నాలుగంటిలో మాత్రమే విజయం సాధించిన ముంబై జట్టు.. పాయింట్స్ పట్టికలో చివరన నిలిచింది. లీగ్ దశ నుంచి ఐపీఎల్ టోర్ని నుంచి నిష్క్రమించిన ముంబై కనీసం తమ స్థానాన్ని సైతం మెరుగుపరచుకోకుండానే ఇక ఐపీఎల్ నుంచి ఇంటి బాట పట్టింది. ఇలా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2022 లోను పదవ స్థానంలో నిలిచిన ముంబై మరోసారి నిరాశపరిచింది. అయితే గత ఏడాది ప్లే ఆఫ్ చేరిన ఆ జట్టు ఈసారి ఫైనల్ చేరి కప్పు కొడుతుందని.. ముంబై అభిమానుల ఆశించిన చివరికి అభిమానులకు నిరాశ తప్పలేదు. దీంతో ఫ్యాన్స్ అందరు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కుప్పిస్తున్నారు. అయితే ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ ను కెప్టెన్ గా తప్పించి హార్దిక్ పాండ్యా చేతికి సారధ్య బాధ్యతలు అప్పగించిన జట్టుకు మాత్రం అదృష్టం ఎక్కడ కలిసి రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl