స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఐపిఎల్ మ్యాచ్ లలో ఎన్నో సీజన్ లుగా ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన నేతృత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు ఎన్నో ట్రోఫీలను కూడా గెలుచుకుంది. ఈయన సారథ్యంలో అద్భుతమైన టీం గా ఎదిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ లో మాత్రం అతి పేలవమైన ప్రదర్శనతో చాలా ఘోరమైన స్థితిలో ఉండిపోయింది. ఇకపోతే ఈ సీజన్ కి ముంబై ఇండియన్స్ జట్టు కి రోహిత్ శర్మ కాకుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించాడు.

ఎప్పుడు అయితే రోహిత్ శర్మ ను కాకుండా హార్దిక్ పాండ్యా ను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా నియమించారో ఆ సమయం నుండి ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం పై ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. ఎంతో గొప్ప అనుభవం అలాగే కెప్టెన్సీలో మెలుకువలు తెలిసిన రోహిత్ శర్మ ను కాకుండా హార్థిక పాండ్యా ను కెప్టెన్ గా నియమించడం ఏమిటి..? ఆయన నేతృత్వం లేనిదే ముంబై ఇండియన్స్ జట్టు మంచి ఆట తీరును కనబరిచాలేదు. ఇలా మరెన్నో విధమైన కామెంట్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఈ జట్టు అత్యంత పేలవమైన ఆట తీరును ప్రదర్శించింది.

ఇకపోతే గత కొంతకాలంగా రోహిత్ శర్మ , ముంబై ఇండియన్ జట్టులో అడడం ఇదే చివరిసారి అని వచ్చే సీజన్ లో ఈయన ముంబై ఇండియన్స్ జట్టు నుండి కాకుండా వేరే జట్టులో ఆడతాడు అని అనేకమంది అన్నారు. ఇకపోతే నిన్న ముంబై ఇండియన్స్ జట్టు ఆఖరి మ్యాచ్ ఆడింది. ఈ ఆఖరి మ్యాచ్ అనంతరం మాజీ క్రికెటర్లు అయినటువంటి వసీం జాఫర్, , షైన్ వాట్సన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  మరి నిజంగానే ముంబై ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలివేస్తారా..? లేక యధావిధిగా ముంబై జట్టులోనే కొనసాగుతారా అనేది స్పష్టంగా తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rs