గత కొంత కాలంగా ఇండియాలో ఐ పీ ఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లు జరుగుతున్న సమయం లోనే వచ్చే నెల ప్రారంభం కాబోయే టి 20 వరల్డ్ కప్ కి సంబంధించిన ఆటగాళ్లను బీసీసీఐ బోర్డు ఎంపిక చేసింది. ఇక ఈ ఎంపిక చేసిన లిస్టులో ఉన్న వారిలో కొంత మంది ఫామ్ లో లేరు. అదే ప్రస్తుతం బీసీసీఐ కి , ఇండియన్ క్రికెట్ అభిమానులకు కాస్త ఆ సహనాన్ని మిగులుస్తోంది. మరి ముఖ్యంగా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే టి 20 వరల్డ్ కప్ లో ఆడటానికి రెడీగా ఉన్న ప్లేయర్ లలో ముగ్గురు ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన వారే ఉన్నారు.

అందులో రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ కి కెప్టెన్ గా వ్యవహరించనుండగా ... సూర్య కుమార్ యాదవ్ , హార్థిక్ పాండ్యా కూడా ఈ లిస్టు లో ఉన్నారు. ఇకపోతే ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం ఏ మాత్రం ఫామ్ లో లేరు. ఇక నిన్న ముంబై ఇండియన్స్ జట్టు లక్నో తో తలపడింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కాస్త పరవాలేదు అనే ఇన్నింగ్స్ ను ఆడి టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లకి నేను పూర్తి సిద్ధంగానే ఉన్నాను అనే సంకేతాన్ని ఇచ్చాడు. సూర్య కుమార్ యాదవ్ , హార్థిక్ పాండ్యా మాత్రం ఈ ఐ పీ ఎల్ సీజన్ లో చాలా పేలవమైన ప్రదర్శనను కనపరిచారు.

వీరు ఇదే ప్రదర్శనను టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో కూడా చూపినట్లు అయితే ఇండియా జట్టుకు భారీ దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఇండియా లీగ్ మ్యాచ్ లలో ఐర్లాండ్ , కెనడా , యూఎస్ఏ జట్లపై తలపడునుంది. ఈ మ్యాచ్ లలో కనుక ఇండియా గెలవాలని... అలాగే ఫామ్ లో లేని ప్లేయర్స్ అంతా కూడా ఫామ్ లోకి రావాలి అని ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: