ఐ పీ ఎల్ జట్లలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ జట్టు 2013 వ సంవత్సరం నుండి 2020 సంవత్సరాల మధ్య 8 సంవత్సరాలలో ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను దక్కించుకుంది. ఇలా ఐదు సార్లు ఈ జట్టు ట్రోఫీల్ని దక్కించుకోవడంతో ఈ జట్టుపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ భారీ అంచనాలు నెలకొంటూ ఉంటాయి. అందులో భాగంగా ఈ జట్టు ఎప్పుడూ భారీ అంచనాల నడుమే గ్రౌండ్ లోకి అడుగుపెడుతూ ఉంటుంది. కానీ 2020 తర్వాత మాత్రం ఈ జట్టుకు ఏ మాత్రం కలిసి రావడం లేదు.

గత నాలుగేళ్లుగా ఈ జట్టు ఐపీఎల్ లో చాలా ధారణమైన ప్రదర్శనను కనబరుస్తూ వస్తుంది. ఇక ఈ జట్టు 2022 మరియు 2024 సీజన్ లో మరి దారుణమైన చెత్త రికార్డును మూట కట్టుకుంది. అసలు ఏమిటా చెత్త రికార్డు అనే వివరాలను తెలుసుకుందాం. 2022 సీజన్ లో ఈ జట్టు భారీ అంచనాల నడుమ ఐపీఎల్ మ్యాచ్ లను మొదలు పెట్టింది. కానీ మొదటి నుండి ఈ జట్టు ఆ సీజన్ లో చాలా దారుణమైన ఆట తీరును కనబరుస్తూ వచ్చింది. దానితో ఈ జట్టు మొదటి లీగ్ మ్యాచ్ లు మొత్తం ముగిసే సరికి అన్ని టీమ్ ల కంటే తక్కువ పాయింట్లు తెచ్చుకొని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ఇకపోతే 2022 వ సంవత్సరం అతి దారుణమైన ఆటతో ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ జట్టు ఈ సంవత్సరం కూడా అలాంటి ఆట తీరునే కనబరిచింది. ఇప్పటికే నిన్నటి మ్యాచ్ తో ముంబై ఇండియన్స్ జట్టు లీగ్ మ్యాచ్ లను అన్నింటిని పూర్తి చేసుకుంది. లీగ్ మ్యాచ్ లు ముగిసే సరికి ఈ జట్టు ఐపిఎల్ లో ఉన్న అన్ని జట్ల కంటే తక్కువ పాయింట్లను సాధించి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది. అలా 2022 , 2024 సంవత్సరాలలో ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి చెత్త రికార్డును మూటగట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mi