ప్రస్తుతం ఇండియా క్రికెట్ అభిమానులు అంతా ఐ పి ఎల్ మ్యాచ్ లను చూడడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే ఐ పీ ఎల్ 2024 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆప్స్ లోకి ఎంటర్ అయ్యాయి. ఇక ప్లే ఆఫ్ లోకి ఎంటర్ ఇవ్వడానికి ఒకే ఒక్క ప్లేస్ ఉంది. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ , బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకి ఓ మ్యాచ్ జరగనుంది.

ఆ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే ప్లే ఆప్స్ లోకి వెళుతుంది. ఇక బెంగళూరు మంచి రన్ రేట్ తో గెలిచినట్లు అయితే బెంగళూరు ప్లే ఆప్స్ లోకి వెళుతుంది. మరి ఈ రోజు ఎవరు ప్లే ఆప్స్ లోకి వెళ్ళబోయే నాలుగవ జట్టు ఏది అనేది తెలియనుంది. ఇక ఈ ఐపీఎల్ సీజన్ పూర్తి కాగానే టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లు స్టార్ట్ కానున్నాయి. ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లు స్టార్ట్ అయ్యే ముందు మే 27 వ తేదీ నుండి జూన్ 1 వ తేదీ వరకు వార్మఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో భాగంగా ఇండియా కూడా ఒక వార్మఫ్ మ్యాచ్ ను ఆడబోతుంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా తాజాగా విడుదల అయింది.

ఇండియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జూన్ 1 వ తేదీన అమెరికాలో వార్మఫ్ మ్యాచ్ జరగనుంది. ఇక జూన్ 1 వ తేదీన ఈ రెండు జట్ల మధ్య వార్మఫ్ మ్యాచ్ జరగనున్నట్లు ఐసిసి బోర్డు ప్రకటించినప్పటికీ అమెరికాలోని ఏ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే టీ 20 వరల్డ్ కప్ లో ఈ సారి ఇండియా అత్యున్నత ఆట తీరును ప్రదర్శించి ట్రోఫీని గెలుచుకుంటుంది అని ఇండియా ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: