(ఐపీఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. ఈ రోజుతో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు కంప్లీట్ కాబోతున్నాయి. దానితో ఇప్పటికే ప్లే ఆప్స్ లోకి వెళ్ళబోయే నాలుగు టీములు అవి అనేది ఫుల్ క్లారిటీ గా తెలిసిపోయింది. ఇక రెండవ , మూడవ స్థానం కు సంబంధించి పోటీ మాత్రమే నెలకొని ఉంది. మిగతా ఒకటో మరియు నాలుగవ స్థానంకు సంబంధించిన బెర్త్ లు ఆల్రెడీ కన్ఫామ్ అయ్యాయి.

మరి ఈ సీజన్ లో ప్లే ఆప్స్ కి వెళ్ళిన జట్లు ఏవి..? అవి ప్రస్తుతం ఏ స్థానాల్లో ఉన్నాయి..? ఏ స్థానాల్లోకి వెళ్లే అవకాశం ఉంది అనే వివరాలను తెలుసుకుందాం. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్ లను ఈ సీజన్ లో ఆడగా 9 మ్యాచ్ లలో గెలుపొంది , మూడింటిలో ఓడిపోయి 19 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ జట్టు మొదటి స్థానంలోనే ఉండబోతుంది. దీనిని బీట్ చేసే అవకాశం ప్రస్తుతానికి ఏ జట్టుకు లేదు.

ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు 13 మ్యాచ్ లలో 8 మ్యాచ్ లలో గెలుపొంది 5 మ్యాచ్ లలో ఓడిపోయి 16 పాయింట్స్ లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 13 మ్యాచ్ లలో ఏడు మ్యాచ్ లలో గెలిచి 5 మ్యాచ్ లలో ఓడిపోయి 15 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఇక ఈ రోజు మ్యాచ్ లో కనుక రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి సన్రైజర్స్ గెలిచినట్లు అయితే రెండవ స్థానంలోకి సన్రైజర్స్ జట్టు వస్తుంది.

ఇక రాజస్థాన్ రాయల్స్ గెలిచినట్లు అయితే ఇదే స్థానంలో ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ గెలిచి సన్రైజర్స్ జట్టు కూడా గెలిచిన రాజస్థాన్ రెండవ స్థానంలోనే ఉంటుంది. ఈ జట్ల విజయాలను బట్టి రెండవ స్థానం , మూడవ స్థానంలో ఉండబోయే జట్లు ఏవి అనేది తెలుస్తుంది. ఇక బెంగళూరు రాయల్ చాలెంజర్ జట్టు 14 మ్యాచ్ లను ఆడి అందులో 7యచ్ లలో గెలుపొంది 14 పాయింట్స్ లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ జట్టు స్థానంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl